30 May, 2026 | 7:49 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ హరిత   •   సీఎం రేవంత్ రెడ్డికి చేరిన సిద్ధాపూర్ డంప్ యార్డ్ వ్యవహారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీతో లబ్ధిదారుల్లో ఆనందం   •   బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి   •   ఉపాధ్యాయుని సేవలు ప్రజలు మరిచిపోలేరు: ఎమ్మెల్యే   •   వెల్నెస్ హాస్పిటల్ 8వ బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని   •   అసమర్ధత కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తుంది   •   మహిళా శక్తి సూపర్ మార్కెట్లు ఏర్పాట్లు చేస్తాం   •   మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి   •   విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దు ఎంపీడీవో   •  

ఆయుర్వేద గ్రామం పునఃప్రారంభం

24-02-2026 12:32 AM

మలక్‌పేట్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): చంచల్‌గూడ జైలులోని సికా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘ఆయుర్వేద గ్రామం’ను జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా  ప్రారంభించారు.  ఆరేండ్ల విరామం అనంత రం ఈ కేంద్రాన్ని సోమవారం డిజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయుర్వేద గ్రామం పునరుద్ధరించడం శాఖకు కీలకమైన సంక్షేమ, సవరణాత్మక ముందడుగుగా నిలిచిందన్నారు.

అనుభవజ్ఞులైన ఆయు ర్వేద వైద్యులు, అర్హత కలిగిన థెరపిస్టులు, శిక్షణ పొందిన సిబ్బందితో పూర్తిస్థాయిలో సేవలు అందించడానికి సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ఐజీ జైళ్లు ఎన్. మురళీబా బు,  హైదరాబా ద్ రేంజ్  డీఐజీ  డా. డి. శ్రీనివాస్, వరంగల్ రేంజ్ డీఐజీ ఎం. సంపత్, సీపీ హైదరాబాద్ సూపరింటెండెంట్ ఎన్ శివకుమార్‌గౌడ్ పాల్గొన్నారు.