24-02-2026 12:34:20 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి) : పోలీసు వ్యవస్థపై కొందరు ఉద్దేశ పూర్వకంగా ఫేక్ వార్తలను సృష్టించి, సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. తన పేరుతో సర్క్యులేట్ అవుతున్న న్యూస్ క్లిప్పింగ్ పూర్తిగా అబద్ధమని, అది ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేలా ఉందని మం డిపడ్డారు.
ఒక వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు ఇలా వ్యవహరిస్తుంటే.. పో లీసులు ఎందుకు పట్టించుకోవడంలేదని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేద ని ఆ యన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి అండ చూసుకునే ఈ ఫేక్ న్యూస్ ముఠా లు ఇలా రెచ్చిపోతున్నాయన్నారు.
ఈ ఫేక్ వార్తలకు కారణమైన వారిని వెంటనే గుర్తించి, డీజీపీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను, పోలీసులను తప్పుదోవ పట్టించే ఇలాంటి తప్పుడు వార్తలు మంచిది కాదని సూచించారు.