04-12-2025 12:00:00 AM
మొయినాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): స్వామియే శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప నామస్మరణతో కనకమామిడి అయ్యప్ప దేవాలయ ప్రాంగణం మారుమోగింది. బుధవారం మండల పరిధిలోని కనకమామిడి అయ్యప్ప గుట్టపై అయ్యప్ప మహాపడి పూజను గురుస్వాములు రఘునందన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, వేణు గురుస్వాముల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
40రోజుల పాటు మాల ధరించి కనకమామిడి నుంచి పాదయాత్రగా 120 మంది కనకమామిడి, సురంగల్, శంషాబాద్, షాబాద్ మండలాలకు చెందిన అయ్యప్ప స్వాములు శబరిమల యాత్రకు పాదయాత్రగా బయలుదేరారు. తిరిగి వచ్చిన అనంతరం బుధవారం అయ్యప్ప మహాపడి పూజను పెద్ద ఎత్తున నిర్వహించారు. దీంతో అయ్యప్ప దేవాలయ సన్నిధాన ప్రాంగణం అయ్యప్ప స్వాములతో పాటు భక్తులతో కిటకిటలాడింది.
అయ్యప్ప స్వామి మహాపడి పూజ విధానాన్ని రఘునందన్ రెడ్డి గురుస్వామితో పాటు సుదర్శన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, వేణు గురుస్వాములు కలిసి 18 మెట్లపై కర్పూర హారతి వెలిగించారు. దీంతో అయ్యవ్ప స్వామి పూజ కన్నుల పండుగగా జరిగింది. విచ్చేసిన భక్తులందరికి స్వామి వారి దర్శనం, తీర్థవ్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.