calender_icon.png 4 December, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసన

04-12-2025 12:00:00 AM

ఘట్ కేసర్, డిసెంబర్ 3 (విజయక్రాంతి) : సీఎం రేవంత్ రెడ్డి హిందూ  దేవతల పైన అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడినందుకు  నిరసనగా బుధవారం ఘట్ కేసర్ పట్టణంలో బిజెపి మున్సిపల్ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసి నిరసన తెలియజేయడం జరిగింది.  సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు.

ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కార్యదర్శి విప్పర్ల హనుమాన్, మున్సిపల్ ఉపాధ్యక్షులు గుండ్ల రామతీర్థ గౌడ్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి చెల్లక శ్రీధర్, కోశాధికారి మేడబోయిన నరేష్, బీజేవైఎం అధ్యక్షులు కొమ్మిడి విక్రాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు అనిల్ గౌడ్, యువమోర్చ ప్రధాన కార్యదర్శి  సురేంద్ర, సీనియర్ నాయకులు ఎదుగని శ్రీరాములు, పల్లె మధు, బండ్లగూడ కిషోర్ గౌడ్, శోభన్, కట్ట మధుసూదన్ రెడ్డి, ఉదయ్, సుమిత్,  బూత్ అధ్యక్షులు ఆకుల పద్మ, మమత శర్మ, ప్రతాప్ రెడ్డి, కార్యకర్తలు, పాల్గొన్నారు.