16 April, 2026 | 4:04 AM

శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు ప్రారంభం..

24-11-2025 05:15 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్ లో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గోమాత పూజ, గణేష్ పూజ, హోమాలతో పాటు పలు పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ట్రస్టు వ్యవస్థాపకులు, చైర్మన్ సాయిరి పద్మ మహేందర్ దంపతుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవాధ్యక్షులు, గురుస్వామి మిట్టపల్లి మురళీధర్, యంత్ర ప్రతిష్టాపకులు, ఆధర్పణ వేద పండితులు ఉప్పర మల్యాల లక్ష్మణ శర్మ, ఆలయ పురోహితులు గూడ రమేష్ శర్మ, శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ మారవేణి లచ్చయ్య, ఆలయ చీఫ్ అడ్వైజర్ కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న), ముత్యాల రవీందర్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు , భక్త బృందం పెద్దఎత్తున పాల్గొన్నారు. మంగళ, బుధవారం రెండు రోజులపాటు శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు పెద్దఎత్తున కొనసాగుతాయని సాయిరీ మహేందర్ పద్మ దంపతులు తెలిపారు.. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.