24-11-2025 05:12:24 PM
బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో లేబర్ కోడ్ పై ఏఐటీయూసీ నిరసన తెలిపింది. సోమవారం శాంతిఖనిలో నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ శాంతిఖనిలో సోమవారం ఆందోళన చేశారు. 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు చట్టాలుగా మార్చడంపై ఆందోళనకారులు నిరసన తెలిపారు. వెంటనే లేబర్ కోడ్ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం దాసోహం చేస్తుందని తీవ్రంగా విమర్శించారు.
లేబర్ కోడ్ రద్దు కోసం సమస్యల పోరాటాలకు వెనుకడమన్నారు. అనంతరం ఈ గని మేనేజర్ విజయ్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేష్ ,పిట్ కార్యదర్శి తిరుపతి గౌడ్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ మంతెన రమేష్, నాయకులు రత్నం ఐలయ్య ,వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు మిట్టపల్లి రమేష్, మైన్స్ కమిటీ సభ్యులు రత్నం ప్రవీణ్, మహంకాళి సంతోష్, రామక్రిష్ణ, శ్రీకాంత్ కార్మికులు పాల్గొన్నారు.