27 May, 2026 | 1:00 AM

వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు

27-05-2026 12:00 AM

సుల్తానాబాద్, మే 26 (విజయ క్రాంతి): ఉత్తర నక్షత్రం అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రి నగర్ లో గల శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వా మి దేవాలయం లో వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా జరిపారు, ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి అభిషేకం, పడి పూజ, హోమాలు పూజారులు గూడ రమేష్ శర్మ, సాయినాథ్ శర్మలు ఘనంగా నిర్వహించారు,

ఆలయ నిర్వాహకులు మాజీ మార్కె ట్ చైర్మన్ సాయిరి మహేందర్, మాజీ స ర్పంచ్ సాయిరీ పద్మ దంపతుల ఆధ్వర్యం లో వేడుకలు ఘనంగా నిర్వహించారు, అ నంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు , పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలుస్వీకరించారు... ఈ కార్యక్రమం లో స్పోరట్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల రవీందర్, విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధి కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న), డీలర్ మెరుగు వెంకటేష్ , పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, తుమ్మ రాములు, గుండ మురళి పలువురు పాల్గొన్నారు.