3 June, 2026 | 2:26 PM

జన్నారం ఎఫ్‌ఆర్‌ఓగా బాబా ఖాదీర్ వలి

03-06-2026 01:52 PM

జన్నారం, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని జన్నారం రేంజ్ ఎఫ్‌ఆర్‌ఓగా బాబా ఖాదీర్ వలి బాధ్యతలు చేపట్టారు. నూతన ఎఫ్‌ఆర్‌ఓ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మాట్లాడారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు అధిక ప్రాధాన్య ఇస్తానని తెలిపారు. ప్రజలు కూడా అటవీశాఖ అధికారులకు సహకరించాలని కోరారు.