5 April, 2026 | 6:34 PM

ఘనంగా డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

05-04-2026 12:04 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... మహనీయుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, గొప్ప సంఘసంస్కర్త అయిన జగ్జీవన్ రామ్ గారు వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి భారత పార్లమెంటులో సుమారు 40 సంవత్సరాల పాటు సేవలందించారని తెలిపారు.

వివిధ కీలక మంత్రి పదవులు నిర్వహించడంతో పాటు ఉప ప్రధానిగా కూడా దేశానికి సేవలందించారని పేర్కొన్నారు.వ్యవసాయ మంత్రిగా పనిచేసిన సమయంలో హరిత విప్లవం విజయవంతం కావడానికి కీలక పాత్ర పోషించి, దేశాన్ని ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర వహించారన్నారు. అలాగే భారత సేనకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ దేశ రక్షణలో ధైర్యసాహసాలు ప్రదర్శించారని,ఆయన సేవలు యావత్ భారత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు.