బైకు కారు ఢీ: వ్యక్తి మృతి
30-05-2026 08:33 PM
శంకర్ పల్లి,(విజయక్రాంతి): బైకును కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసానిగూడ గ్రామ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వికారాబాద్ నుండి శంకర్పల్లి వస్తున్న మారుతి ఆల్టో కారు మండలంలోని మాసాని గూడ సమీపంలో ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న కిషన్ నాయక్(45) తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. కిషన్ నాయక్ ఇండ్లలో టైల్స్ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు అని తెలిపారు. కిషన్ నాయక్ వికారాబాద్ వాసిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ముద్దస్సర్ అలీ తెలిపారు.






