ధాన్యం సేకరణ, లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్ గడ్డం నగేష్
కోనరావుపేట మండలం పలు గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మిల్లుల తనిఖీ
కోనరావుపేట,(విజయక్రాంతి): ధాన్యం సేకరణ, లోడింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని, రైస్ మిల్లుల వద్ద ధాన్యాన్ని అన్ లోడింగ్ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.శనివారం కోనరావుపేట మండలం కొలనూర్, మర్తనపేట, నాగారం, ధర్మారం, కనగర్తి, నిజామాబాద్, వెంకట్రావుపేట గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను, కనగర్తి గ్రామంలోని కనకదుర్గ, మారుతి రైస్ మిల్లులు, కొలనూర్ గ్రామంలోని సరస్వతి, వినాయక రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.
ధాన్యానికి సంబంధించి ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీలో జాప్యం చేయవద్దని సూచించారు. సరిపడా వాహనాలు అందుబాటులో ఉంచేలా పర్యవేక్షణ చేస్తున్నామని, సంబంధిత ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లకు సరిపడా వాహనాలు సమకూర్చాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. హమాలీల సంఖ్య పెంచుకుని ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని అన్నారు. రైస్ మిల్లర్లు వేగవంతంగా ధాన్యం అన్ లోడింగ్ చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. తనిఖీలో తహసీల్దార్ వరలక్ష్మి, తదితరులు ఉన్నారు.






