మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి
శంకర్ పల్లి,(విజయక్రాంతి): మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఇటీవల నూతనంగా ఎంపికైన శంకర్ పల్లి మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు చెంగల్ బాలకృష్ణారెడ్డి మాజీ ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ఐక్యమత్యంతో ముందుకు సాగి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.
ప్రభుత్వం గ్రామాలతో పాటు మున్సిపాలిటీలకు కూడా పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తుందన్నారు. మున్సిపల్ లోని ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ఎటువంటి సమస్యలు లేకుండా పాలను కొనసాగించాలని, ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనంతరెడ్డి, మాజీ కౌన్సిలర్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.






