6 April, 2026 | 2:48 AM

దేశ నిర్మాణంలో బాబు జగ్జీవన్ రామ్ పాత్ర ఎంతో కీలకం

06-04-2026 12:00 AM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్

కామారెడ్డి, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): దేశ నిర్మాణంలో బాబు జగ్జీవన్ రామ్ పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ అన్నారు. ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను పాటిస్తూ ముందుకు సాగాలని కోరుకున్నారు. బాబు జగ్జీవన్ రామ్ చేసిన సామాజిక సేవలను కొనియాడారు. దేశ నిర్మాణంలో ఆయన పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగడం ద్వారా సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.  ఈ సందర్భంగా పలువురువత్తలు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు.

ఈ వేడుకల్లో అదనపు కలెక్టర్ మధుమెహన్, ఆర్డిఓ యెన్ వై గిరి, మున్సిపల్ చైర్ పర్సన్ ఉమారాణి, ఎస్సి  కార్పొరేషన్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, సంఘ సభ్యులు మాజీ జెడ్పిటిసి కొత్తపల్లి మల్లన్న, మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు పర్కి ప్రేమ్ కుమార్ , అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తోల్ల గంగారం, ఖ్యాతం సిద్ధిరాములు, ఆకుల బాబు,  అంబేత్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దుభాసి నరేందర్,  బట్ట వెంకట రాములు, బట్టంకి బాలరాజు-, శివ రాములు వేముల బలారం, బాలమణి, ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు గణేష్ నాయక్, గడ్డంసంపత్ , బిక్కనుర్ యాదయ్య, బోలేశ్వర్--దళిత శక్తి కార్యక్రమ గైని  రాజు, సంఘి రాజలింఘం, దళిత సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఎర్ర శివరాజు, మాల మహానాడు రాష్ట్ర నాయకులు రాజనర్స్,రజక సంఘం అధ్యక్షులు చాకలి రాజయ్య, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు విట్టాల్, రాష్ట్ర అధ్యక్షుడు జీవీఎం విట్టాల్, రాష్ట్ర కార్యదర్శి, రాజ్ కుమార్, బంసెప్ జిల్లా అధ్యక్షుడు సాయి గౌతం ,ఎస్సీ ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకట్, ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, ఎమ్మార్పీఎస్ నాయకులు, జంగం శ్రీశైలం,  చిట్యాల సాయన్న, పత్రీ అశోక్, దళిత శక్తి సమన్వయ కర్త, మాల మహానాడు అధ్యక్షుడు కంకణాల రమేష్  పాల్గొన్నారు.

బిచ్కుందలో..

బిచ్కుంద, ఏప్రిల్ 5(విజయక్రాంతి); కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్పర్సన్ సీమ రమేష్ షెట్కార్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్రామ్ 119వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ పాలకవర్గం,సిబ్బంది ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ సీమా రమేష్ షెట్కార్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ సమాజంలో చేసిన పోరాటపటిమను గుర్తుచేసుకున్నారు. అనంతరం ఛైర్పర్సన్ సీమ రమేష్ షెట్కార్ ఆధ్వర్యంలో పలు వార్డులలో ప్రజలతో కలియ తిరిగుతూ వార్డుల పరిశుభ్రత పాటించడానికి పలు సూచనలు ప్రజలకు మున్సిపల్ పరిశుద్య సిబ్బందికి తెలిపారు.  ఈ కార్యక్రమంలో చైర్మన్ సిమా రమేష్ షెట్కార్ తో పాటు వార్డు కౌన్సిలర్లు నౌషా నాయక్, ధర్పల్లి కార్తీక ,సిబ్బంది తుల శ్రీనివాస్, కారోబార్ వీరేశం ,సిబ్బంది పాల్గొన్నారు.