6 April, 2026 | 2:44 AM

ఏండ్రియాల పుస్తెలతాడు చోరీ కేసును ఛేదించిన పోలీసులు..

06-04-2026 12:00 AM

వివరాలు వెల్లడిస్తున్న ఎల్లారెడ్డి డి.ఎస్.పి శ్రీనివాసరావు 

- తాడ్వాయి,ఏప్రిల్, 6( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఏండ్రియాల గ్రామంలో ఈనెల 2న తెల్లవారుజామున జరిగిన పుస్తెలతాడు చోరీ కేసును పోలీసులు చేదించారు. ఆన్లైన్ గేమ్ లకు బానిస అయి వ్యసనానికి గురైన ఓ వ్యక్తి ఎలాగైనా డబ్బులు సమకూర్చుకోవాలనే తపనతో ఓ మహిళకు కత్తితో బెదిరించి పుస్తెలతాడును దొంగిలించి తీసుకెళ్ళాడు. ఎల్లారెడ్డి డిఎస్పీ కార్యాలయంలో ఆదివారం డిఎస్పి శ్రీనివాసరావు ఈ కేసు వివరాలు వెల్లడించారు.

ఈ నెల 2న తెల్లవారుజామున ఏండ్రియాల్ గ్రామంలో గ్రామానికి చెందిన బాణాల అనసూయ అనే మహిళ ఉదయం లేచి ఇంటి ముందు ఉన్న వాకిలి ఊడుస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మాస్కు ధరించి కత్తితో బేరించాడు  ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కుని వెళ్లిపోయారు. ఈ విషయమై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ నిర్వహించాయి. సీసీ కెమెరాల ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిందితుడు అదే గ్రామానికి చెందిన బానాల తిరుపతిరెడ్డిగా గుర్తించారు. ఆయన ఆదివారం కృష్ణాజివాడి బస్టాండ్ ప్రాంతంలో సంచరిస్తున్న సమయంలో ఆయనను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై ఆయనను విచారించగా వివరాలు వెల్లడించారని డీఎస్పీ తెలిపారు.

ఆన్లైన్‌గేమ్ లో అప్పుల పాలు అయినందుకే..

బానాల తిరుపతిరెడ్డి ఆన్లైన్లో గేములు ఆడుతూ బెట్టింగులు పెడుతూ ఆన్లైన్ గేమ్ లకు బానిస అయ్యాడు. దీంతో చాలా డబ్బులు ఖర్చు చేశారు. అప్పుల పాలయ్యాడు. ఆ అప్పులు తీర్చడానికే పక్కా ప్రణాళికతో పుస్తెలతాడు చోరీకి పాల్పడినట్లు డిఎస్పి వివరించారు. మహిళ మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును ఆ పహరించుకు పోయాడని వివరించారు. నిందితుడి నుంచి మూడు తులాల బంగారు గొలుసు నేరానికి పాల్పడిన కత్తి ముఖానికి ధరించిన స్కార్పు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. యువకులు ఆన్లైన్ గేమ్‌లకు బానిస కావద్దని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్, తాడువాయి ఎస్‌ఐ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.