8 August, 2026 | 8:42 PM

శ్రీ చైతన్య స్కూల్లో ఘనంగా బద్ది పోచమ్మ బోనాలు

08-08-2026 07:34 PM

వేములవాడ,(విజయక్రాంతి): వేములవాడ శ్రీ చైతన్య స్కూల్లో శనివారం బద్దిపోచమ్మ బోనాల సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అమ్మవారి, పోతురాజుల వేషధారణలతో సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఏజీఎం ముద్రకోల రాజు మాట్లాడుతూ.. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు తెలంగాణ సంప్రదాయాలపై అవగాహన పెరుగుతుందని అన్నారు.

బోనాల వేషధారణలో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్లు సునీల్ కుమార్, మమత, జోనల్ పీఈటీ శ్రీకాంత్, ప్రిన్సిపాల్ సుదేశి, డీన్ అంజయ్య, ఇన్‌చార్జిలు అరుణ్‌కుమార్, ప్రవళిక, శివాని, హరీష్, అరుణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆకునూరి సుధీర్, పీఈటీలు సుధాకర్, మారుతి, కవిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.