కోటగిరిలో వైభవంగా శ్రీ మరియమ్మ దేవి ఆలయ పండగ
బిఆర్ఎస్ నాయకులు వల్లేపల్లి శ్రీనివాస్ రావు విరాళం అందజేత...
బాన్సువాడ,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో కొలువైన శ్రీ మరియమ్మ దేవి ఆలయo పండగ మహోత్సవాలు శనివారం గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి అమ్మవారికి పంచామృత విశేషాలు పట్టు వస్త్రాలు సమర్పణ మంగళ హారతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులను కల్పించారు. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వల్లేపల్లి శ్రీనివాసరావు ఆలయ నిర్వహణ , అభివృద్ధి కోసం పదివేల రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బొట్టే గజేందర్, విజయ్ ,నజీర్ పాషా భాయ్.పి. గంగారం,తేళ్ల చిన్నా అరవింద్,అంబాటి రాజ గౌడ్, మామిడి నవీన్, మహేష్ జలాల్, చింటూ తదితరులు పాల్గొన్నారు.
ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో వల్లేపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, అమ్మవారి కృపాకటాక్షాలు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, కోటగిరి గ్రామం సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గ్రామంలో ఆలయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు చూసుకోవాలని సూచించారు. ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్థులు విరాళం ప్రకటించిన వల్లేపల్లి శ్రీనివాసరావు కి, అలాగే ప్రత్యేకంగా హాజరైన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.






