8 August, 2026 | 9:23 PM

ఘనంగా బోనాల సంబరాలు

08-08-2026 08:20 PM

ఇచ్చోడ,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రగతి పాఠశాలలో బోనాల పండుగ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాఠశాలకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందంగా అలంకరించిన బోనాలతో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించారు. బోనాల పండుగ విశిష్టత, తెలంగాణ సంస్కృతిలో ఈ వేడుకకు ఉన్న ప్రాధాన్యతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.

పాఠశాల ప్రాంగణం బోనాల సందడితో కళకళలాడింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటారు. చదువుతో పాటు విద్యార్థులకు మన సంస్కృతి, పండుగలు, సంప్రదాయాలపై అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సురకంటి వనమాల, ప్రిన్సిపాల్ కె. ప్రవీణ్, వైస్ ప్రిన్సిపాల్ ఏ. మంజుల, నిజాముద్దీన్, పీఈటీ అల్లం సాయికిరణ్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.