18 April, 2026 | 3:25 AM

'అమ్మ మాట-అంగన్వాడీ బాట'

10-06-2025 05:09 PM

మునగాల: సూర్యాపేట జిల్లా(Suryapet District) మునగాల మండల పరిధిలోని బరాఖత్ గూడెం గ్రామంలో ‘అమ్మ మాట-అంగన్వాడి బాట' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఐసిడిఎస్ సూపర్వైజర్(ICDS Supervisor) బెజవాడ సరిత మాట్లాడుతూ... 03 సంవత్సరాలలోపు పిల్లలను అంగన్వాడీ సెంటర్ కు తప్పకుండా పంపించాలని, మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు ఆటపాటల ద్వారా విద్య నేర్పడంతో పిల్లల మేదోశక్తి పెంపొందుతుందని పేర్కొన్నారు.

అలాగే పిల్లలకు పోషకాహారం అందించడం వల్ల పిల్లలు ఏలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎదుగుదలకు అంగన్వాడి కేంద్రాలు దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి దేవారం శ్వేత, అంగన్వాడీ టీచర్లు, కాలే సునీత షేక్ షబానా, గ్యార సుధారాణి, షేక్ అమితాబేలు, అంగన్వాడి హెల్పర్లు, ఆశ బోనాల లక్ష్మి, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.