పిన్నెల్లికి బెయిల్
29-05-2024 01:37 AM
విజయవాడ, మే 28 (విజయక్రాంతి) : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో మంగళవారం ఊరట లభించింది. పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ ఆరో తేదీ వరకు పిన్నెల్లి విషయంలో కఠిన చర్యలు తీసుకోరాదని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేశారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి పొందిన మధ్యంతర ఉత్తర్వుల్లో విధించిన షరతులన్నీ ఈ ఆదేశాల్లో కూడా అమలు జరుగుతాయని స్పష్టం చేశారు. అనుచరులు ఏదైనా అల్లర్లకు పాల్పడినా అందుకు పిన్నెళ్లి బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది.






