24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
- వచ్చే నెల 18న ఓటింగ్
- షెడ్యూల్ ప్రకటించిన సీఈసీ
న్యూఢిల్లీ, మే 22: దేశవ్యాప్తంగా 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18న ఎన్నికలు నిర్వహించ నున్నట్లు ఈసీ ప్రకటించింది. జూన్ 1న నోటిఫికేషన్ విడుదల, జూన్ 8 వరకు నామినేషన్ల దాఖలకు చివరి తేదీ, 9న నామినేషన్ల పరిశీలన, జూన్ 11 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ప్రకటించింది. 18న ఎన్నికలు ముగియగానే సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తామని జూన్ 20 కల్లా ఎన్నికల ప్రక్రియను ముగిస్తామని పేర్కొంది.
పదవీ విరమణ చేస్తున్న వారిలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడలు కూడా ఉన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) జాతీయ అధ్యక్షుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) నాయకుడు సి.వి. షణ్ముగం రాజీనామాల కారణంగా ఖాళీ అయిన రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.






