భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు
17-06-2024 12:20 PM
రాజన్న సిరిసిల్ల ,(విజయక్రాంతి): బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లాలోని ఈద్గాల వద్ద ముస్లింలు పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లోని ఈద్గాల వద్ద సందడి నెలకొంది. ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో హిందూ ముస్లిం భాయి భాయిలాగా ఉండి శాంతిని నెలకొల్పే విధంగా ఉండాలని ప్రార్థన చేశారు. స్థానిక రాజకీయ నాయకులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.






