24 May, 2026 | 9:54 AM

మహబూబాబాద్‌లో దారుణం.. అప్పుడే పుట్టిన మగ శిశువును పడేశారు

17-06-2024 12:15 PM

మహబూబాబాద్ జిల్లాలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. రైల్వేస్టేషన్ శివారులో శిశువు మృతదేహాన్ని గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడు పుట్టిన మగ శిశువును పడేశారు. శిశువు మృతదేహాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.