ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు దగ్గర ఈద్గా వద్ద బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలనంతరం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముస్లిం సోదరులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ఎఐసిసి కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు మన్నె జీవన్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఎన్ పి వెంకటేష్, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, సిజె బెనహర్, ఫయాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షులు ఆజ్మత్ అలి, రాజేందర్ రెడ్డి , బి వెంకట్ రెడ్డి, మక్సూద్ తదితరులు పాల్గొన్నారు.






