24-04-2025 01:58:30 AM
హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): జమ్మూ కశ్మీర్‌లో తాజా పరిస్థితిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. బుధవారం జమ్మూ కశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్‌కు కేంద్ర మంత్రి ఫోన్ చేశారు. అక్కడ ఉన్న పర్యాటకుల భద్రతపై పూర్తి సమాచారం తెలుసుకున్నారు. వారికి పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని కోరారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు.