calender_icon.png 19 September, 2025 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్మూకశ్మీర్‌లో శాంతి నెలకొల్పాలి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

24-04-2025 02:00:26 AM

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): పర్యాటక ప్రాం తమైన జమ్మూకశ్మీర్‌లో ముష్కరుల జరిపిన హత్యాకాండ అమా నుషమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. ఈమేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రాణాలు కోల్పోయిన వారికి సీపీఎం రాష్ట్ర కమి టీ తరఫున తీవ్ర సంతాపాన్ని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఆప్తులను కోల్పోయిన కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.