24-04-2025 01:58:27 AM
ధాన్యం కాంట చేయడం లేదని రాస్తారోకో
కామారెడ్డి జిల్లాలో పాలు చోట్ల నిరసనలు
కామారెడ్డి, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ధాన్యం కాంటా చేయడం లేదని నిరసిస్తూ కామారెడ్డి జిల్లాలో రైతులు రోడెక్కారు. గంట పాటు రాస్తారోకో చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన కూడా కాంట చేపట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో పాటు పొతంగల్ మండల కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకొని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పొతం గల్‌కు చేరుకోగా, రైతులు ఆయనకు సమస్యను విన్నవించుకున్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లి, వెంటనే ధాన్యం కొనుగోలు చేపడతామని రైతులకు శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. రామారెడ్డి మండల కేంద్రంలో పోలీసుల జోక్యంతో రైతులు ఆందోళనను విరమించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు.