7 May, 2026 | 1:46 PM

కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!

07-05-2026 12:40 PM

హైదరాబాద్: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(Karimnagar MLA Gangula Kamalakar) క్యాంపు కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. గంగుల క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) వ్యాఖ్యలకు నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో దాడులకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే గంగుల క్యాంపు ఆఫీసులో ఫర్నీచర్, ధ్వంసం చేశారు. బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి ప్రయత్నించారు. కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్(BRS) కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

కౌశిక్ రెడ్డి కారు అద్దాలు ధ్వంసం, క్యాంపు కార్యాలయంలో విధ్వంసం

కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నాడు టెస్టుకు రావాలి అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ తీసుకుంటున్నాడు టెస్టుకు రావాలి అంటూ పాడి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో బండి సంజయ్ అనుచరులు దాడికి తెగబడ్డారు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నాడనే సమాచారంతో దాడి చేసినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కౌశిక్ రెడ్డి కారు అద్దాలు పగలగొట్టి, క్యాంపు కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు.