calender_icon.png 20 February, 2026 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంజారా ఆరాధ్య దైవం!

15-02-2026 12:00:00 AM

నేడు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి :

భారతదేశ సామాజిక-ఆధ్యాత్మిక చరిత్రలో సంత్ సేవాలాల్ మహారాజ్  విశిష్ట స్థానాన్ని సంపాదించారు. బంజారా సమాజానికి ఆధ్యాత్మిక గురువుగా, మార్గదర్శకుడిగా నిలిచిన ఆయనను బంజారా ప్రజలు తమ కుల దైవంగా, గురువుగా ఆరాధిస్తారు. ఆయన జీవితం, బోధనలు దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు నేటికీ స్ఫూర్తినిస్తున్నాయి. సంత్ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15న జన్మించారు. అయితే ఆయన జన్మస్థానం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

కొందరు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా లో గుత్తి  మండలం సమీపంలోని గొల్లలదొడ్డి గ్రామం వద్ద ఉన్న సేవాగడ్‌లో జన్మించారని, మరికొందరు కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని సు రగొండనకొప్ప ఆయన జన్మస్థలంగా పేర్కొంటారు. ఆయన కాలంలో అడవివాసులు, సంచార జీవన విధానంలో ఉన్న గిరిజన సమాజాలు అన్యాయా లకు, దోపిడీకి గురయ్యాయి. ఈ పరిస్థితిని గ్రహించిన సేవాలాల్ బంజారా, ఇతర గిరిజన సమాజాల అభ్యున్నతికి కృషి చేశారు.

దేశమంతటా సంచరిస్తూ మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, హానికర ఆచారాలను నిర్మూలించేందుకు ప్రయత్నించారు. జంతు బలులు, దోపిడీ సంప్రదాయాలు, బలవం తపు మత మార్పిడులను వ్యతిరేకించారు. సత్యం, కరుణ, తర్కబద్ధత ఆధారంగా నైతిక జీవనాన్ని ప్రోత్సహించారు. సంత్ సేవాలాల్ ఆధ్యాత్మికత, అం తరంగ పవిత్రత, సామాజిక బాధ్యత, ప్రకృతితో సమన్వయ జీవనాన్ని ప్రధానంగా ప్రోత్సహించింది. మహిళలకు, వృద్ధులకు, సమస్త జీవులకు గౌరవం ఇవ్వాలని ఉపదేశించారు.

మద్యపానం, అనైతిక ప్రవర్తన, విభేదాలను విడిచిపెట్టి క్రమశిక్షణ, ఐక్యతతో జీవించాలని పిలుపునిచ్చారు. బంజా రా సమాజాన్ని పూర్తిగా సంచార జీవన విధానం వదిలి ‘తండాల్లో’ స్థిరపడేలా మా ర్గనిర్దేశం చేయడాన్ని ఆయన విప్లవాత్మక కృషిగా చెప్పవచ్చు. వ్యవసాయం, స్థిర జీవ నం, సామాజికవృద్ధిలో భాగస్వామ్యం ద్వా రా సమాజానికి ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించే పునాదులను వేశారు. గోర్ బోలి (బంజారాల భాష) సాంస్కృతిక గుర్తింపును కాపాడడానికి ప్రాముఖ్యతనిచ్చారు.

లంబాడి భాట్లు ‘సేవాభాయ’ మహాకావ్యాన్ని నేటికీ గానం చేస్తూ ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను వర్ణిస్తారు. సేవాగడ్‌లో ఆయన జన నం, దేవికి సమర్పణలు, న్యాయం, కరుణకు ప్రతీకలైన సంఘటనలు బంజా రా మౌఖిక సాహిత్యంలో ప్రత్యేక స్థానం పొందాయి. ఇవి కేవలం జానపద గాథలు మాత్రమే గాక నైతిక విలువలకు ప్రతీకలుగా నిలుస్తాయి. అడవివాసులు, గిరిజన సమాజాల్లో సహజ చికిత్సలు, ఆరోగ్య పరిరక్షణ పట్ల అవ గాహన కల్పించారు.

అడవులను రక్షించాలి, ప్రకృతితో సమన్వయంగా జీవించాలి అని బోధించారు. ఆయన ప్రతిపాదించిన సేవా సిద్ధాంతాలు, సత్యనిష్ఠ, వివక్ష రహిత సమాజం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక ఐక్యత, సంఘబ లం విలువలను ప్రతిపాదించాయి. 1806 డిసెంబర్ 4న రుహీగఢ్‌లో ఆయ న సజీవ సమాధి పొందారు. మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా పోహరాదేవి వద్ద ఉన్న ఆయన సమాధి స్థలం ‘బంజారా కాశీ’గా ప్రసిద్ధి చెందింది.

ప్రతి సంవత్సరం సేవాలాల్ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. కేవ లం ఒక ఆధ్యాత్మిక నాయకునికి నివాళిగా మాత్రమే కాకుండా సామాజిక చై తన్యాన్ని రగిలించిన విప్లవ జ్యోతికి ఇచ్చే గౌరవం. అనేక బంజారా గ్రామాల్లో ఆయనకు చాలా దేవాలయాలు ఉన్నాయి. జానపద గీతాలు, సంప్రదాయ ఉత్సవాలు సేవాలాల్ స్మృతిని తరతరాలకు చేరవేస్తున్నాయి.

 సురేష్ బాబు, 9989988912