మత్స్యశాఖ సహకార సంఘం చైర్మన్ గా బానోతు సైదులు
గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండల పరిధిలోని తాళ్ళమల్కాపురం గ్రామంలో గురువారం జరిగిన మత్య సహకార సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన బాణోతు సైదులు నాయక్ ను ఏకగ్రీవంగా మత్య శాఖ సహకార సంఘం చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి యమ్. అమరెందర్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధులుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు త్రిపురం. అంజన్ రెడ్డి,మాజీ జడ్పిటిసీ పెండెం శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్మన్ బాణోతు సైదులు నాయక్ మాట్లాడుతూ... తన గెలుపులు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞత తెలియజేస్తూ తన యొక్క పదవి బాధ్యతలను నిబద్దతతో సొసైటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.






