లాసెట్‌లో స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థికి సన్మానం
05-06-2026 07:53 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): ఇటీవల విడుదలైన లాసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించి విశేష ప్రతిభ కనబర్చిన సాయి మణిదీప్ రెడ్డిని తెలంగాణ రక్షణ సేన నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన యువ నాయకులు, మానకొండూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్, శాతవాహన యూనివర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్, జేఏసీ చైర్మన్ చెన్నమల్ల చైతన్య మాట్లాడుతూ... పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితక్క, జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ గార్ల ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సేన ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.






