calender_icon.png 29 December, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే ఒక్కడు?

29-12-2025 12:31:45 AM

బాన్సువాడ రిజిస్ట్రేషన్ శాఖలో అన్నీ తానై అక్రమ రిజిస్ట్రేషన్లకు వత్తాసు

అతను చెప్పినట్టే వింటున్న అధికారులు

చెప్పిన చోటా సంతకాలు

అక్రమ రిజిస్ట్రేన్లతో లక్షల వసూలు

అడిగితే బెదిరింపులు.. రిజిస్ట్రేషన్ల నిలిపివేత

కన్నెత్తి చూడని జిల్లా ఉన్నతాధికారులు

బాన్సువాడ, డిసెంబర్ 28 (విజయక్రాంతి): బాన్సువాడ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఒకే ఒక్కడు చక్రం తిప్పుతూ  అక్రమ రిజిస్ట్రేషన్ల కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఆ ఒకే ఒక్కడు చెప్పిందే వేదంగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారి పనిని పూర్తి చేసి పెడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో పనిచేసే ఆ ఒకే ఒక్కడు అన్ని తానే అన్ని అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అతని వ్యవహారంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.  కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఒకే ఒక్కడు లీలలు అంతా అంతా కావు.

గత కొన్ని రోజుల క్రితం బాన్సువాడ పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన ఆనుకొని ఉన్న పక్కా నిర్మాణాన్ని నామమాత్రంగా డిస్మెంటల్ చేసి అట్టి ప్రాంతాన్ని ఖాళీ స్థలంగా చూపించి ఒకే ఒక్కడు రిజిస్ట్రేషన్ కు దారి సుగుమం చేసినట్లు తెలిసింది. బోధన్ ప్రాంతంలో బాండ్ పేపర్ను కొనుగోలు చేసి, బాన్సువాడ లో రిజిస్ట్రేషన్ జరిగినట్లు అక్రమ రిజిస్ట్రేషన్ పత్రాలను సృష్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. డాక్యుమెంటరీ పత్రాలలో బోధన్ సబ్ రిజిస్టర్ స్టాంప్ తో కూడిన పత్రాలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. బోధన్ లో జరిగిన తథాంగంపై మతలబు ఏమిటా నన్న సంశయం కూడా ఏర్పడుతుంది.

ఇదిలా ఉండగా రిజిస్ట్రేషన్స్ తంతు పూర్తయినప్పటికీ, ఖాళీ స్థలాన్ని చూపించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వ్యక్తులు పక్కా గోడలపైనే తిరిగి పనులను చేపట్టడం కూడా అనుమానం కలుగుతుంది. ఈ విషయంలో ఓ వ్యక్తి స్థానిక మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం పనులను సదరు మున్సిపల్ అధికారులు నిలిపివేశారు. కాగా, ఈ విషయంలో అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందన్న అంశంపై ఆరోపణలు వెళ్ళు వెతుతున్నాయి. అధికారులు సైతం కార్యాలయంలో ఆ ఒక్కడు చెప్పినట్లే వింటూ ఎలాంటి రిజిస్ట్రేషన్ అయిన అధికారులు సంతకాలు పెట్టి ఆ ఒక్కడికి వత్తాసు పలుకుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఇది ఇలా ఉంటే అక్రమ రిజిస్ట్రేషన్ ల పేరిట భారీగా లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి దీనికి ఉదాహరణ పట్టణంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్. ఏది ఏమైనా అధికారులు వత్తాసు పలకడంతో ఆ ఒకే ఒక్కడు కార్యాలయంలో హిస్టారికన వ్యవహరిస్తున్నారని సామాన్య ప్రజలు రిజిస్ట్రేషన్ కు వెళితే తన వద్దకే ఫైలు రావాలని తాను ఎంత చెప్తే అంత డబ్బులు చెల్లించాలంటూ జులుం చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఎవరైనా లక్షలు డబ్బులు వసూలు చేయడంపై ప్రశ్నిస్తే బెదిరింపులు రిజిస్ట్రేషన్ల నిలిపివేత వంటి చేపట్టడం జరుగుతుందని సామాన్య ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇంత జరుగుతున్న కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. అంతేకాకుండా గతంలో నిజాంబాద్ లో జరిగిన ఏసీబీ దాడులు కూడా బాన్సువాడ సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఆ ఒకే ఒక్కడు రైటర్ పై కూడా దాడులు చేపడితే అక్రమ రిజిస్ట్రేషన్ల బాగోతం బయటపడుతుందని పలువురు అధికారులను కోరుతున్నారు. ఇప్పటికైనా ఏసీబీ అధికారులు బాన్సువాడ సబ్ రిజిస్టర్ కార్యాలయం పై దాడులు నిర్వహిస్తే అసలు విషయం బయట పడుతుందని అలాగే బిచ్కుంద కామారెడ్డి జిల్లా కేంద్రాల సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై కూడా దాడులు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

అసైన్డ్ భూములు సైతం

సబ్ రిజిస్ట్రేషన్  శాఖలో అసైన్డ్  భూములను సైతం అధికారులు డబ్బులు తీసుకుని దొడ్డి దారిన పట్టాలను చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ విషయంలో ఏమాత్రం లోటుపాట్లు ఉన్న ఒకే ఒక్కడు ద్వారా సంప్రదింపులు జరిపి ఒప్పందం కుదిరిన వెంటనే పేర్ల మార్పిడి విషయంలో అధికారులు  తగు శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. బాన్సువాడ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో  తానే రిజిస్ట్రేషన్ శాఖ అధికారిగా చలామణి అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల తో పాటు, భూములు ప్లాట్లు కొనే  మధ్యవర్తుల వరకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అసలైన క్రయవిక్రయదారుల నుండి సమాచారాన్ని స్వీకరించకుండా ఒకే ఒక్కడు చెప్పిందే విధంగా పట్టాలను మార్చేస్తున్నట్లు సమాచారం. బాన్సువాడ మండలంలో ఉన్న ఒక భూమి రిజిస్ట్రేషన్ విషయమై అక్రమ రిజిస్ట్రేషన్లకు పూనుకున్నట్లు వదంతులున్నాయి.

ఈ విషయంలో  ఒకే ఒక్కడు కీలక పాత్ర పోషించి అన్ని తానే ఈ వ్యవహారాన్ని నడిపినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ శాఖలో ఆయన చెప్పిందే విధంగా బాన్సువాడ రిజిస్ట్రేషన్ శాఖలో సిబ్బంది నుండి మొదలుకొని అధికారి వరకు తలాడించి పనిచేసే పరిస్థితి నెలకొంది. బాన్సువాడ పట్టణంలో రోడ్డు వెడల్పు లో భాగంగా ఇరువైపులా కూలిపోయిన భవనాల స్థలాలను కొందరికి పైకం పుచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసినట్లు పుకార్లు ఉన్నాయి. ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న వ్యక్తిపై జిల్లా అధికారులతో పాటు ఏసిబి అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకో వాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. 

అక్రమ రిజిస్ట్రేషన్లు.. లక్షల్లో డబ్బులు

బాన్సువాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు లక్షల్లో డబ్బులు వసూలు పాల్పడుతున్నారని పలు విమర్శలు ఉన్నాయి. ఒకే ఒక్కడు ఈ అక్రమ రిజిస్ట్రేషన్ లతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో యజమానులతో లక్షల్లో ఒప్పందం కుదుర్చుకొని అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నారని కార్యాలయంలో చర్చలు జరుగుతున్నాయి అంతేకాకుండా ఒకే ఒక్కడికి అటు అధికారులు ఇటు సిబ్బంది సపోర్ట్ చేయడంపై పలు అనుమానాలకు తావిస్తోంది అధికారులు సిబ్బంది సైతం అక్రమ రిజిస్ట్రేషన్ లో పాలుపంచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.

అధికారులు ఇటువైపు చూసేనా?

గత కొన్ని రోజులుగా అవినీతి అరికట్టేందుకు ఏసీబీ అధికారులు చాకచక్యంగా వ్య వరిస్తున్నారు. బాన్సువాడలో రిజిస్ట్రేషన్ శాఖలో అన్ని తానే కార్యాలయంలో చలామణి అవుతున్న ఆ ఒకే ఒక్కడిపై ఏసీబీ అధికారులు నిగా పెట్టి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలకు నిత్యం సేవలందించే శాఖల పై దృష్టి పెట్టి పక్కా బాధితుల సమాచారం వరకు దాడులు నిర్వహించి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకున్న సంఘటనలు గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉన్నాయి.

ఏసీబీ పెట్టిన నిఘానేత్రంలో పలు అధికారులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అసలు భూముల రిజిస్ట్రేషన్ పట్టాల మార్పిడి, ఎల్లార్ పేమెంట్ విషయంలో రైటర్లు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మిలాకతై పనుల ను పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ప్రతి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అక్రమ రిజిస్ట్రేషన్ లతో లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారు. ఇలాంటి వాటిపై ఇప్పటికే ఏసీబీ అధికారులు నిఘా పెట్టినట్లు సమాచారం.  ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు .సామాన్యులకు న్యాయం జరిగేలా చూడాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.