అక్రమ వెంచర్లకు కేర్ ఆఫ్ @బాన్సువాడ
- విచ్చల విడిగా వెలుస్తున్న వైనం
- నిబంధనలకు పాతర రాబోయే రోజుల్లో అవస్థలు పడనున్న కొనుగోలు దారులు
- అనుమతులు లేకుండా వందల ట్రిప్పుల్లో మొరం
- ఖాళీ జాగా కనిపిస్తే చాలు వెంచర్ గా డెవలప్ మెంట్
- కన్నెత్తి చూడని సంబంధిత శాఖ ఉన్నతాధికారులు
బాన్సువాడ, జూలై 2 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ అక్రమ వెంచర్లకు కేరాఫ్ గా మారుతుంది.నిబంధనలకు పాతర వేస్తూ, ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా ఇస్టారితీన అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లాగా వెలుస్తున్నాయి. దీనికి కొందరు బడా బాబులు పరోక్షంగా మద్దతు తెలుపుతూ ఉండడంతో అక్రమార్కులు ఇష్టానుసారంగా, ఎక్కడపడితే అక్కడ ఖాళీ జాగా కనిపిస్తే చాలు వెంచర్లను వేస్తూ, సామాన్యులకు అరచేతిలో వైకుంఠం చూయిస్తూ, రాబోయే రోజుల్లో ఇబ్బందులను పట్టించుకోకుండా వెంచర్లను వేస్తున్నారు.
వ్యవసాయ భూములను దర్జాగా ఎలాంటి అనుమతులు లేకుండా, కొన్నిచోట్ల నాలా కన్వర్షన్లు కూడా లేకుండా ఇష్టానుసారంగా ఎలాంటి అనుమతులు లేకుండా వందల ట్రిప్పుల్లో మొరం వేస్తూ కనీస నిబంధనలు పాటించకుండా తమ దందాను కొనసాగిస్తున్నారు. బాన్సువాడ పట్టణం మున్సిపాలిటీగా మారడంతో ప్లాట్లకు ఉన్న డిమాండ్ ను ఆసరా చేసుకొని, రాబోయే రోజుల్లో ప్లాట్లు కొనుగోలు చేసుకుని ఇల్లు నిర్మించే వారికి ఇబ్బందులను పక్కనపెట్టి, తమ దందా కొనసాగుతే చాలు నియమ, నిబంధనలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు మాత్రం ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాన్సువాడ మండలంలోని ఆయాచోట్ల మొరం అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా రాత్రి వేళలో వెంచర్లకు వందల ట్రిప్పుల్లో మొరం తరలిస్తున్న సంబంధిత అధికారులకు తెలియదని పరువు పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు. వెంచర్లలో ఎన్ని ఫీట్ల రహదారులు ఉండాలి, వ్యవసాయానికి పనికిరాదు అని భూమిని వెంచర్గా చేసేందుకు నాలా కన్వెన్షన్ చేసే అధికారులు సైతం ఇవేమీ పట్టించుకోకుండా కొందరికి అనుమతులు ఇవ్వడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 10 శాతం భూమి గ్రామపంచాయతీ పరిధిలో ఉంటే గ్రామపంచాయతీకి, పట్టణ పరిధిలో ఉంటే మున్సిపాలిటీకి కేటాయించాల్సి ఉంటుంది.
దీనికి తోడు 15 శాతం భూమిని మార్డ్ గేజ్ చేయాల్సి ఉంటుంది. విద్యుత్ స్తంభాలు, నీటి సదుపాయం, పార్కు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తదితర అన్ని రకాలుగా నియమ నిబంధనలు పాటించి వెంచర్లు వేయాల్సి ఉండగా ఇవేమీ లేకుండా, ఫైనల్ లేఅవుట్ లేకుండానే దర్జాగా ప్లాట్లను విక్రయిస్తుండడం గమనార్హం. బాన్సువాడ పట్టణం దినదిన అభివృద్ధి చెందుతుండడంతో ప్లాట్లు కొనుగోలు చేసేవారు ఎక్కువ కావడంతో దీనిని ఆసరా చేసుకొని అక్రమార్కులు పలువురు నియమ నిబంధనలు పక్కనబెట్టి ఇష్టానుసారంగా వెంచర్లు వేస్తూ, తమ జేబులు నింపుకుంటున్నారు.
సాగు భూములను దర్జాగా నాలా కన్వెన్షన్ పేరిట డిటిసిపి అనుమతి లేకుండానే వందల ట్రిప్పుల్లో మొరం వేస్తూ కనీసం మధ్యలో 33 ఫీట్ల రహదారి సైతం నిర్మించకుండానే విక్రయాలు కొనసాగిస్తుండడం పట్ల పలువురు సంబంధిత అక్రమ వెంచర్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు సైతం ఇటువైపు ఎందుకు కన్నెత్తి చూడడం లేదని రాబోయే రోజుల్లో తలెత్తి ఇబ్బందులను ఎందుకు పట్టించుకోవడంలేదని వెనుక అసలు మాత్రం ఇట్టే అర్థమవుతుందని పట్టణవాసులు పలువురు సంబంధిత అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేని వెంచర్లపై, కేవలం నాలా కన్వెన్షన్తో జరుపుతున్న రిజిస్ట్రేషన్ లపై, పట్టణం పరిసరాల్లో కొనసాగుతున్న తంతుపై పూర్తిస్థాయిలో కులం కుశంగా ప్రత్యేక బృందం ద్వారా విచారణ చేపట్టి అక్రమంగా వెలుస్తున్నా వెంచర్లపై, దానికి బాధ్యులపై కఠిన చర్యలు ఉన్నతాధికారులు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని పట్టణవాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు.
వ్యవసాయ భూములు వెంచర్లగా ఏర్పాటు...
బాన్సువాడ పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములను రియల్ వ్యాపారులు ధనార్జనయ ధ్యేయంగా ప్రభుత్వానిబంధనలను తుంగలో తొక్కి వ్యవసాయ భూములను వెంచర్లుగా ఏర్పాటు చేస్తూ అమాయక ప్రజలను దండుకుంటున్న సంఘటనలు ఎన్నెన్నో ఉన్నాయి. అంతేకాకుండా భవిష్యత్తులో ప్రభుత్వాన్నిబంధనలు ప్రకారం రిజిస్ట్రేషన్ కాకపోవడం మున్సిపల్ అనుమతులు మంజూరు కాక నానా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుందని పలువురు పేర్కొంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవసాయ భూములను నాలా అనుమతులు లేకుండా మున్సిపల్ అనుమతి పొందకపోవడం 10% భూమిని వదలక పోవడం లాంటి ఎన్నో అక్రమాలు చేస్తూ రియల్ వ్యాపారులు హిస్టారికల్ వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి వెంచర్లపై ఉన్నత అధికారులు విచారణ చేపట్టి అక్రమ వెంచర్లపై కొరడా ఝళిపించాలని పట్టణ ప్రజల కోరుతున్నారు.
ఖాళీ జాగా కనిపిస్తే చాలు వెంచర్ నిర్మాణాలు...
బాన్సువాడ పట్టణ ప్రాంతం తోపాటు పరిసర ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్కడ ప్రభుత్వ భూమి అయినా అసైన్డ్ భూమి అయినా వెంచర్ ఏర్పాటు చేసి రియల్ వ్యాపారులు అక్రమాలకు తెర లేపుతున్నారు. అంతేకాదు కనీసం ప్రభుత్వం నియమ నిబంధనలను గ్రామపంచాయతీ అనుమతి మున్సిపల్ అనుమతిలు లేకుండానే ఖాళీ జాగాలో వెంచర్లు హిస్టారీతిన ఏర్పాటు చేసి ప్రభుత్వ అనుమతులు లేకున్నా వెంచర్లను విక్రయిస్తూ భవిష్యత్తులో పట్టణ ప్రజలకు రిజిస్ట్రేషన్ కాకపోవడం ఇతరత్రా ఎన్నో నష్టాలు ఉండడంతో అయినా కానీ రియల్ వ్యాపారులు మాత్రం ధనార్జన కోసం ఖాళీజాగలపై కన్ను వేస్తున్నారు. అలాంటి వెంచర్ల నిర్మాణాలను వెంటనే రద్దుచేసి అమాయక ప్రజలను మోసం చేస్తున్న రియల్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఉన్నత అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
కన్నెత్తి చూడని సంబంధిత శాఖ అధికారులు...
బాన్సువాడ పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాలలో హిస్టారీతిన ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ వెంచర్లను ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఆ వైపు జిల్లా సంబంధిత శాఖ అధికారులు కన్నీటి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇంత అక్రమ వెంచర్లు పుట్టగొడుగులుగా వెలుస్తున్న సంబంధిత శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా అక్రమ వెంచర్లపై అనుమతి లేని వెంచర్లపై సంబంధిత శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుని వెంచర్లను రద్దు చేయాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.






