2 July, 2026 | 6:43 PM

జమలాపురం శ్రీవారి ఆలయంలో జీర్ణోద్ధరణ ధ్వజస్తంభ కార్యక్రమాలు

02-07-2026 06:09 PM

ఎర్రుపాలెం జూలై 2 (విజయ క్రాంతి):  శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం( Srivari Temple) జమలాపురం నందు జీర్ణోదరణ, ధ్వజ ప్రతిష్ట సహిత మహా కుంభాభిషేకం కార్యక్రమములో భాగంగా ఈరోజు ఉదయం 07-00 ని"లకు ప్రాత:కాల పూజలు, బలిహరణ అనంతరం  శ్రవణా నక్షత్ర యుక్త కర్కాటక లగ్న పుష్కరాంశము నందున సి యు అలివేలుమంగా, పద్మావతి అమ్మవార్లకు ,సోమేశ్వర స్వామి వారి ఆలయ జీవద్వజ ప్రతిష్ట సుముహూర్తమునా భక్తుల  గోవింద నామ స్మరణల మధ్య ధ్వజ ప్రతిష్ట అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రాణ ప్రతిష్టా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

శ్రీ వెంకటేశ్వర అన్నదాన సేవా కమిటీ వారు అన్నదానం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో 12000 వేల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించినారు.  ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎం.వీరస్వామి , ఆలయ కార్యనిర్వాహణాధికారి కొత్తూరు జగన్ మోహన్ రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయ దేవ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస్ శర్మ, వకుళ మాత స్టేడియం నిర్మాణదాత తుళ్లూరు కోటేశ్వరరావు నిర్మలా కుమారి దంపతులు,  గ్రామస్తులు భక్తులు ,  ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.