2 July, 2026 | 6:29 PM

లక్ష్మీనరసింహరామ శర్మను ఆశీర్వదించిన ఎమ్మెల్యే విజయ రమణారావు

02-07-2026 05:47 PM

సుల్తానాబాద్, జులై 02 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో గురువారం ఉప్పల మల్యాల లలిత చంద్రశేఖర్ శర్మ మనవడు, కృష్ణ కుమార్ వాసవి దంపతుల పుత్రుడు లక్ష్మీ నరసింహ రామ శర్మ కు ఉపనయన బ్రహ్మోపదేశములు వైభవంగా  నిర్వహించారు, ఈ కార్యక్రమం లో ప్రభుత్వ విప్ , పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొని లక్ష్మీ నరసింహ రామ శర్మను ఆశీర్వదించారు, ఈ కార్యక్రమం లో విజయ రమణారావు వెంట జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, మినుపాల డిలేశ్వరావు, మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి, శ్రీ రామ్ కుమార్ స్వరాజ్యలక్ష్మి , రాధాకృష్ణ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, కొమురవెల్లి అంజయ్య  తోపాటు పెద్ద ఎత్తున పలువురు పాల్గొన్నారు....