బార్ అండ్ బెంచ్ స్నేహపూర్వక సంబంధాలే ప్రధానం
నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి
నిజామాబాద్ లీగల్ కరెస్పాండెంట్, డిసెంబర్12 (విజయక్రాంతి) : బార్ అండ్ బెంచ్ సంబంధాలు అనేవి స్నేహపూర్వకంగా ఉన్నప్పుడే న్యాయస్తానాల విధులు సాఫిగా సాగిపోతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి. ఎన్ భారత లక్ష్మీ అన్నారు. నిజామాబాద్ మొదటి అదనపు జిల్లాజడ్జిగా హరీష,నాల్గవ అదనపు జిల్లాజడ్జిగా దుర్గా ప్రసాద్, నిజామాబాద్ ఐదవ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా కీర్తి రాజ్ నూతనంగా నియామాకం అయిన సందర్భంగా, మూడవ అదనపు జిల్లాజడ్జిగా ఇంచార్జిగా వరూధిని పదవి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రశాంగించారు.
నవంబర్ 29 న తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవి దేవి జిల్లా అధికారిక పర్యటనను విజయవంతం చేయడంలో సహకరించిన న్యాయవాదులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బార్ అండ్ బెంచ్ సంబంధాలను ఇముడింపజేశారని ఆమె కొనియాడారు.న్యాయమూర్థులుగా మేమిక్కడ విధులలో ఉంటాము, బదిలీ అయితే వేరొక చోటకు వెళతాము కాని న్యాయమూర్తులు, న్యాయవాదులుగా మన మధ్య ఉన్న సంబంధాలే కోర్టుల పనితీరుకు గీటురాయిగా నిలుస్తాయని ఆమె తెలిపారు.
సీనియర్ న్యాయవాదుల పనితీరును చూసి జూనియర్ న్యాయవాదులు చాలా నేర్చుకోవాలన్నారు. ‘మహాభారతంలో ధర్మరాజు జూదంలో ఓడిపోయి సందర్బంలో దుశ్శసనుడు ద్రౌపది ని చెరబట్టినప్పుడు తన్నోడి నన్నోడేనా, నన్నోడి తానోడేనా అని ద్రౌపది అన్న మాటలలో, సందర్బంలో సాంకేతిక సమస్య ఉన్నదని తెలుపుతు ఏ విషయంలో అయిన నిపుణుల సలహాలు, సహకారం అవసరమనే అవసరాన్ని జిల్లాజడ్జి భారత లక్ష్మీ గుర్తు చేశారు‘.
సమస్యలు ఉన్నప్పుడు సర్దుకొని పోవాలని ఆమె అన్నారు. తరపున అదనపు జిల్లాజడ్జిలుగా బాధ్యతలు స్వీకరించిన దుర్గా ప్రసాద్, వరూధిని, జూనియర్ సివిల్ జడ్జి కీర్తి రాజ్ లకు బార్ తరపున పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ న్యాయమూర్తులుగా మా విధులలో న్యాయవాదుల సహాకారం చాలా అవసరమని అన్నారు.
న్యాయవాదుల నుండి నేర్చుకొనేది చాలా ఉన్నదని నిరంతర విధులలో, నూతన న్యాయ విషయాలు వెలుగు చూస్తాయని ఆ వెలుతులో జడ్జిలు పయనిస్తారని వారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు మంతెన రాజేందర్ రెడ్డి,బార్ ఉపాధ్యక్షుడు రెంజర్ల సురేష్, సంయుక్త కార్యదర్శి ఝాన్సిరాని, న్యాయవాదులు రమాదేవి, ప్రవీణ, సీనియర్ న్యాయవాదులు కృపాకర్ రెడ్డి, ఎర్రం గణపతి, జక్కుల వెంకటేష్వర్, ప్రభుత్వ న్యాయవాది ఆమీదాల సుదర్శన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి, నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




