calender_icon.png 16 December, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగం వదిలి.. ఊరి కోసం కదిలి..

13-12-2025 12:00:00 AM

  1. 22 ఏళ్లకే సాఫ్ట్‌వేర్  కొలువు  గ్రామాభివృద్ధి కోసం రాజకీయాల్లోకి అడుగు.          
  2. ఉపసర్పంచ్‌గా ఎన్నికైన తుడిమిడి యువతి బండారు రిషిత

నకిరేకల్, డిసెంబర్ 12 : శాలిగౌరారం మండలం తుడిమిడి గ్రామానికి చెందిన బండారు రిషిత 22 ఏళ్లకే సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించినా, తన ఊరిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉద్యోగాన్ని వదిలి రాజకీయ రంగ ప్రవేశం చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి దిగింది. తాజాగా జరిగిన తొలి విడత ఎన్నికల్లో రిషిత తుడిమిడి ఉపసర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన రిషిత బీటెక్ పూర్తి చేసిన వెంటనే సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం పొందారు. అయితే, తన పుట్టిన ఊరి అభివృద్ధే ముఖ్యమని భావించి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకుంది.

ఆమె సేవా భావాన్ని గుర్తించిన తుడిమిడి గ్రామంలోని బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు మద్దతు తెలుపడంతో రిషితను ఏకగ్రీవంగా ఉపసర్పంచ్గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రిషిత మాట్లాడుతూ, నా ఊరి కోసం నా వంతు బాధ్యతగా ఏదైనా చేయాలనే తపనతో ఎన్నికల్లో పోటీ చేశానన్నారు. నన్ను నమ్మి ఏకగ్రీవంగా ఎన్నుకున్న తుడిమిడి గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే గ్రామాభివృద్ధిలో తన వంతు పాత్ర తప్పక పోషిస్తానన్నారు.