బురదమయంగా బార్డిపూర్- పెంట కలన్ రోడ్డు
04-07-2026 01:21 AM
బోధన్, జూలై 3 (విజయక్రాంతి): బోధన్ మండలంలోని బార్డిపూర్ నుంచి పెంట కలన్ కు వెళ్లే రహదారి పూర్తిగా బురదమయంగా మారడంతో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగించడం కష్టంగా మారిందని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.






