4 July, 2026 | 2:23 AM

డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ

04-07-2026 01:22 AM

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్

బాన్సువాడ, జులై 3 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే పోచారం నివాసం వద్ద శుక్రవారం బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామస్థులు 122 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపట్టాలను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేశామని వారి పేరు మీద ఇళ్ల పట్టాలను కూడా అందజేయడం జరిగిందన్నారు.

బాన్సువాడ నియోజకవర్గంలో సొంత ఇల్లు లేని ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేశామని మిగిలిన వారికి కూడా ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ఇల్లు నిర్మించి ఇస్తామని ఆయన తెలిపారు. పిల్ల పట్టాలను అందజేసినందుకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాసుల బాలరాజుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి, బీర్కూర్ తహసీల్దార్ సవాయి సింగ్, బాన్సువాడ పట్టణ, బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.