2 March, 2026 | 8:21 AM

బాసర త్రిబుల్ ఐటీ సరికొత్త రికార్డు

01-03-2026 12:00 AM

పీయూసీ 1, పీయూసీ 2 తరగతుల 3,238 మంది విద్యార్థులు ఒకే సమయంలో స్టడీ 

నిర్మల్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీ అరుదైన ఘనతను సాధించింది. విద్యార్థుల చదువు కోసం ప్రత్యేక శ్రద్ధ నిర్వహిస్తున్న నైట్ స్టడీ అవర్స్ ప్రోగ్రాం మూడు రికార్డులను సాధించినట్టు వైస్ చాన్స్‌లర్ తెలిపారు. పీయూసీ 1, పీయూసీ 2 తరగతులకు చెందిన 3,238 మంది విద్యార్థులు ఒకే సమయంలో క్రమశిక్షణతో కూడిన స్టడీ చేయడం రికార్డుకు సాధ్యమైంది. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ వైస్ బుక్ రికార్డ్, నేషనల్ బుక్ రికార్డులో చోటు దక్కింది. ప్రతిరోజు 8 గంటల నుంచి 10 గంటల వరకు ఈ స్టడీ అవర్స్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.