నా వంతు ఉద్యోగ ధర్మం నిర్వహించా
ఎన్ సుధాకర్ రావు
పాల్గొన్న కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి
సికింద్రాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): నా వంతుగా ఉద్యోగ ధర్మం నిర్వహించి హైదరాబాద్ జిల్లా యువజన క్రీడల అధికారిగా జిల్లా క్రీడలను 32 సంవత్సరాల పాటు నడిపించానని ఎన్.సుధాకర్ రావు అన్నారు. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించి సమర్ధవంతమైన అధికారిగా గుర్తిం పు తెచ్చుకున్నారు అన్ని పలువురు నాయకులు అన్నారు.
హైదరాబాద్ డిస్టిక్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ (డివైఎస్‌ఓ) ఎన్.సుధాకర్ రావు పదవి విరమణ కార్యక్రమం శనివారం బాలంరాయ్ క్లాసిక్ గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, జంపన ప్రతాప్, గజ్జల నగేష్, టి.ఎన్ శ్రీనివాస్, బానుక నర్మద హాజరై శుభాకాంక్షలు తెలిపి, సుధాకర్ రావు దంపతులను శాలు వా కప్పి, పూలమాలతో ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి అధికారులు, క్రీడాకారులు, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.




