15 July, 2026 | 5:23 AM

చండీగఢ్ కార్పొరేషన్‌లో రణరంగం

25-12-2024 02:10 AM

* కొట్టుకున్న కౌన్సిలర్లు

చండీగఢ్, డిసెంబర్ 24: చండీగఢ్ కార్పొరేషన్ రణరంగంగా మారింది. మంగళవారం మున్సిపల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే అంబేద్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలంటూ ఆప్, కాంగ్రెస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు. నెహ్రూ హయాంలోనే అంబేద్కర్‌కు అవమానం జరిగిందని ఆరోపించారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.