16 April, 2026 | 6:24 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

రాష్ట్రంలో తక్షణమే బీసీ రక్షణ చట్టం తేవాలి

24-02-2026 12:19 AM

రిటైర్డ్ డీజీపీ పూర్ణ చంద్రరావు

ఖైరతాబాద్,ఫిబ్రవరి23(విజయాక్రాంతి): అగ్ర వర్ణాల ఆధిపత్యంలో అభం శుభం తెలియని చిన్నారి మృతి చెందడం బాధాకరమని,   బీసీ రక్షణ చట్టం తేవాలని అల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ కో- ఆర్డినేటర్, రిటైర్డ్ డిజిపి డా. పూర్ణ చంద్రరావు డిమాండ్ చేశారు. సోమవారం బీసీ సమాజ్ అధ్యక్షులు సంగెం సూర్య రావు ఆధ్వర్యంలో జరిగిన సంత్ గాడ్గే బాబా జయం తి వేడుకలో రిటైర్డ్ డీజీపీ పూర్ణ చంద్ర రావు ముఖ్య అతిథిగా పాల్గొని సంత్ గాడ్గే బాబా చిత్ర పటానికి పూలమాల వేసి  నివాళ్ళులు అర్పించారు.

మనకు మన భావి తరాలకు నిజమైన స్టార్స్ సంత్ గాడ్గే బాబా, అంబేద్కర్, రావు పూలె, సావిత్రి భాయ్, సాహు మహారాజ్ లని బహుజన మేధావులు ప్రచారం చేయాలనీ ఆయన కోరారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గుండె చప్పుడు కనకయ్య మాదిగ, మహాశక్తి నాయకులు ముంజగల విజయకుమార్, ఎస్సీ ఉప కులాల అధ్యక్షులు బైరి వెంకటేష్ బీసీ సమాజ్ జర్నలిస్టుల రాష్ట్ర నాయకులు చంద్రకాంత్, బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ కుమార్ యాదవ్, మట్టి మనుషుల సంపాదకులు నరసింహ పాల్గొన్నారు.