వాన కాలంలో అప్రమత్తంగా ఉండాలి
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం, జూన్ 10: వాన కాలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మీర్‌పేట్‌లోని క్యాంపు కార్యాలయంలో పలు బస్తీల నాయకులతో ఆమె సమావేశమయ్యారు. నాలాలు, ప్రధాన రహదారుల మరమ్మతులు, అంతర్గత రోడ్లు, వీధి దీపాలు, తాగునీరు వంటి పలు అంశాలపై వారితో చర్చించారు. ఎన్నికలకు ముం దు చేపట్టిన అభివృద్ధి పనులు ఏ మేరకు పూర్తయ్యాయనే విషయంపై ఆరా తీశారు. ఎక్కడైనా పనులు ఆలస్యంగా కొనసాగితే తన దృష్టికి తీసుకు రావాలని చెప్పారు. ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ సీ అర్జున్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.






