అభివృద్ధిపై సమీక్ష
11-06-2024 12:14 AM
ఇబ్రహీంపట్నం, జూన్ 10: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సూచించారు. సోమవారం ఆయన నివాసంలో 4 మండలాల అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్, కొత్త గా చేపట్టాల్సిన పనులను వేగంగా పూ ర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని, అన్నిశాఖల అధికారులు తమ విధులు సక్ర మంగా నిర్వహించాలని కోరారు.






