28 February, 2026 | 6:22 AM

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి

28-02-2026 01:15 AM

జయశంకర్ కలెక్టర్ రాహుల్ శర్మ 

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని జయశంకర్ జిల్లా కలెక్టర్  రాహుల్ శర్మ అన్నారు. ఐడిఓసీలో  తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది నిరంతరం ప్రజలతో మమేకమై విధులు నిర్వహిస్తుంటారని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా రక్తపోటు, షుగర్, హీమోగ్లోబిన్, బరువు, తదితర సాధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

ఈ పరీక్షల ద్వారా ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి వచ్చే నెలల్లో స్పెషలిస్ట్ వైద్యులచే మెగా వైద్య శిబిరం నిర్వహించి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పి సంకీర్త్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, టిజిఓ కార్యదర్శి  సునీల్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ మహమ్మద్ సంధాని, కార్యవర్గ సభ్యులు డాక్టర్ మధుసూదన్, బాబూరావు, డాక్టర్ కుమారస్వామి, ఫణి కుమార్, డాక్టర్ వెంకన్న, సంతోష్, శ్రీనివాసరావు, రాధిక, స్వాతి టీజీఓ ప్రతినిధులు, టీఎన్జీవో అధ్యక్షులు బూరుగు రవి, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శంకరయ్య, వైద్య బృందం, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.