ఎన్‌ఐటీలో స్ప్రింగ్ ఫ్రీ వేడుకలు
28-02-2026 01:17 AM
మహబూబాబాద్, విజయక్రాంతి: ప్రసిద్ధిగాంచిన వరంగల్ జాన్ (జాతీయ సాంకేతిక విద్యాసంస్థ) ఎన్‌ఐటి లో స్ప్రింగ్ ఫ్రీ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. 1978లో ప్రారంభమైన వార్షిక వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహించడం ఆనవవాయితీగా వస్తోంది.
ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా వ్యాప్తంగా దాదాపు పదివేల మంది పాల్గొంటున్నారు. ప్రముఖ సినీ నటులతో పాటు వివిధ రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు సంస్థలు ఇందులో భాగస్వాములు అవుతున్నారు. ఈ కార్యక్రమంలో అనేక నూతన సాంకేతిక ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తోంది. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో టెక్నో జియాన్, కాన్వకేషన్ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఎన్‌ఐటి వరంగల్ లో పండగ వాతావరణం నెలకొంది.




