22 April, 2026 | 2:55 PM

Breaking News

కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల రెడ్డి   •   ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..   •   గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •  

అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలి

29-06-2025 12:16 AM

న్యాయమూర్తి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి

ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలోని ప్రభుత్వ బాలబాలికల ఉన్నత పాఠశాల నందు ఇల్లందు మండల న్యాయ సేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో  శనివారం  న్యాయ చైతన్య సదస్సు నిర్వహిచారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి చంద్రిక రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై  మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులు మత్తు పదార్థాల వినియోగం వాటి వలన  కలిగే  దుష్ఫలితాలు, అక్రమ రవాణా  అరికట్టడంపై చిన్న వయస్సు నుంచి అవగాహన కలిగి ఉండాలని మత్తు పదార్థాలు వినియోగం వల్ల ఏర్పడుతున్న దుష్ఫలితాల గురించి, అక్రమ రవాణా   విద్యార్థి, విద్యార్థులు  తెలిసిన  వ్యక్తుల ద్వారా  గాని, తెలియని వ్యక్తుల ద్వారా  గాని వారికి తెలియకుండానే  అక్రమ రవాణాకు  బాధ్యులు అయ్యే అవకాశం ఉందన్నారు.  అందుకే   మీకు తెలియకుండా   అపరిచిత వ్యక్తులు ఇచ్చే వస్తువులని అందులో  ఏమి వస్తువులు ఉన్నాయని తెలుసుకొని ఇవ్వడం వల్ల   బారిన పడకుండా  చూసుకునే   బాధ్యత  మీదే అని తెలిపారు.