20 May, 2026 | 11:15 AM

సృజనాత్మకతను అలవర్చుకోవాలి

24-08-2024 12:28 AM

ఇస్రో రిటైర్డ్ సైంటిస్ట్ జీవీ రమణ

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23 (విజయక్రాంతి): విద్యార్థులు సృజనాత్మకతను అలవర్చుకోవాలని ఇస్రో రిటైర్డ్ సైంటిస్ట్ జీవీ రమణ సూచించారు. శుక్రవారం చార్మినార్ మండలంలోని సుల్తాన్‌షాహీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హైదరాబాద్ జిల్లా సైన్స్ అధికారి ఆధ్వర్యంలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగావిద్యార్థులకు ఆయన ఉపగ్రహాల పనితీరుపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు పెయింటింగ్, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పీవీ నర్సరాజు, మహమ్మద్ యూసుఫ్, ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రావణ్‌కుమార్, ఉపాధ్యాయులు పుట్టిరా జు, తుకారాం, రజినీసుందరం, హర్ష, రా జేందర్, వెంకటేశ్వర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.