26 ఆలయాలకు ట్రస్ట్ బోర్డులు
- ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్, ఆగస్టు 23(విజయక్రాంతి): రాష్ట్రంలో వారసత్వం లేని దేవాలయాల ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ధార్మిక, హిందూ మత సంస్థలు, ఎండోమెంట్ యాక్ట్ 1987 ప్రకారం రాష్ట్రంలో దాదాపు 26 దేవాలయాలకు నూతన ధర్మకర్తల నియామకాల కోసం ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. జీవోతో పాటే దరఖాస్తు ఫారాన్ని కూడా విడుదల చేసింది. ఆసక్తి ఉన్నవారు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి 20 రోజుల లోపు అంటే సెప్టెంబర్ 11వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది.
ఆలయాల జాబితా..
ఉజ్జయిని మహంకాళి ఆలయం సికింద్రాబాద్, ఎల్లమ్మ పోచమ్మ ఆలయం బల్కంపేట, శ్రీగణేష్ ఆలయం సికింద్రాబాద్, శ్రీ సీతారా మ చంద్రస్వామి ఆలయం శంషాబాద్, రామలింగేశ్వర స్వామి టెంపుల్ కీసరగుట్ట, చెన్నకేశవస్వామి ఆలయం జడ్చర్ల, మైసమ్మ టెంపుల్ నవాబ్‌పేట్ (మహబూబ్‌నగర్), ఆంజనేయస్వామి టెంపుల్ (నాగర్ కర్నూల్), జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం అలంపూర్, లక్ష్మీనర్సింహస్వామి టెంపుల్ ధర్మపురి, కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం కాళేశ్వరం, లక్ష్మీనర్సింహస్వామి ఆలయం కొడవటంచ, శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయం కాజీపేట, వీరభద్రస్వామి ఆలయం కురవి, సమ్మక జాతర మేడారం, వీరభద్రస్వామి ఆలయం కొత్తకొండ, పార్వతీజడల రామలింగేశ్వర స్వామి ఆలయం చెరువుగట్టు, లక్ష్మీనర్సింహస్వామి ఆలయం మట్టపల్లి, లక్ష్మీనర్సింహస్వామి ఆలయం యాదగిరిగుట్ట, మత్స్యగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వెంకటాపురం, అంథోల్ మైసమ్మ ఆలయం దండుమల్కాపురం, సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం పాలకుర్తి, బుగులు వేంకటేశ్వరస్వామి టెంపుల్ చిల్పూరు గుట్ట, కోదండరామి స్వామి టెంపుల్ నవాబ్‌పేట్, భద్రకాళి దేవస్థానం వరంగల్, మల్లికార్జున స్వామి టెంపుల్ ఐనవోలు






