ఎలుగుబంటి కలకలం
రైతులు ప్రజలు ఆందోళన...
సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండండి..
ఎల్లారెడ్డి రేంజ్ అధికారి చరణ్ తేజ..
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండి మాసానిపేట్ లో ఎలుగుబంటీ కలకలం సృష్టిస్తోంది. వారం రోజులుగా ఎలుగుబంటి ఈ ప్రాంతంలో సంచరిస్తోందని గ్రామస్థులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంటి తన పిల్లలతో కలిసి పొలాల్లోకి వస్తుందని దాంతో పొలం పనులకు వెళ్లేందుకు భయపడుతున్నామని రైతులు పేర్కొంటున్నారు. ఈ విషయమై అటవీశాఖ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. అటవీ శాఖ అధికారి వివరణ కోరగా ఎలుగుబంటిని అడవిలోకి పంపిస్తాం. రైతులు ప్రజలు ఆందోళన చెందవద్దు అని తెలిపారు. రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి రేంజ్ అధికారి చరణ్ తేజ్ తెలిపారు.
వారం రోజుల నుండి ఎల్లారెడ్డి పట్టణంలోని గండి మాసంపేట, శివారు ప్రాంతంలో, కలకలం రేపుతున్న ఎలుగుబంటి పట్ల రైతులు ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి రేంజ్ అధికారి, చరణ్ తేజ్, అటవీ శాఖ ఎల్లారెడ్డి రేంజ్ అధికారులతో, ప్రాంత ప్రజలతో ఎలుగుబంటి సమీపిస్తున్న పరిసర ప్రాంతం అటవీ ప్రాంతం వరకు గస్తీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్ నాయక్, సెక్షన్ అధికారి, విక్కి మాటిన్,బీట్ ఆఫీసర్లు, రాజ్ కుమార్, సవిత శారద, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






